సచివాలయం, రైతు భరోసా, వెల్ నెస్ 7 నూతన భవనాలను ప్రారంభించిన అధికారి చందన
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : కోలమూరు, కొంతమూరు గ్రామాలలో సచివాలయం 4, 2, 1 వద్ద సచివాలయం, రైతు భరోసా, వెల్ నెస్ ఏడు నూతన భవనాలను రూరల్ కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ పచ్చదనం-సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ ... జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పారదర్శకతతో ప్రజలకు చేరాలనే ముఖ్య ఉద్దేశంతో గ్రామాలు, పట్టణాల్లో అన్ని సదుపాయాలతో ప్రభుత్వము సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్ నెస్ కేంద్రాలను నూతన భవనాలను రాష్ట్రం అంతట నిర్మిస్తున్నారని అన్నారు. స్థానిక ప్రజలు వారికి ఏ సమస్యలు ఉన్నా ఆయా కార్యాలయాలకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించడానికి సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ఇతర సిబ్బంది వారికి అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన దక్షత చూపుతున్నారన్నారు. కొంతమూరు, కోలమూరు గ్రామ ప్రజలు అందరూ ఇప్పుడు ప్రారంభించిన కేంద్రాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని చందన కోరారు. స్థానికంగా ఏ సమస్య ఉన్నా తన దఅష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధముగా చర్యలను తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెసిఎస్ కన్వీనర్స్ తాడాల.చక్రవర్తి, విష్ణుమూర్తి, మాజీ సర్పంచ్ అత్తిలి.భీమశంకరం, పడాల.ప్రసాద్, పరిమి.దుర్గారావు, శ్రీనివాస్ గౌడ్, చెరుకూరి.సత్యనారాయణ, పిల్లి.సూర్యారావు, మెల్లిమి.గాబ్రియేల్, తీటి.ప్రసాద్, బాజీ.ఆనందరావు, వైసిపి ముఖ్య నాయకులు, కన్వీనర్లు, పార్టీ శ్రేణులు, వివిధ విభాగాల అధ్యక్షులు, పంచాయితీ కార్యదర్షి విజయ రెడ్డి, పంచాయితీ రాజ్ ఏ ఈ సంపత్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










