Jan 15,2023 14:45

హైదరాబాద్‌ : తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 17వ తేదీన నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 17వ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజున సచివాలయాన్ని సీఎం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. నూతనంగా నిర్మించిన రాష్ట్ర సచివాలయానికి డా.బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంగా పేరు పెట్టిన విషయం తెలిసిందే. కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టారు.