Jun 23,2022 11:20

ప్రజాశక్తి - పెనుమంట్ర(పశ్చిమగోదావరి) : పెనుమంట్ర , ఆలమూరు గ్రామాల్లో సచివాలయ భవనాన్ని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ , ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గురువారం ప్రారంభించారు. ఆలమూరులో డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్రెడ్డి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో నాడు-నేడులో భాగంగా వాటర్‌ ప్యూర్ఫికేషన్‌ ప్లాంట్‌, కిచెన్‌ షెడ్‌ మొదలగు అభివృద్ధి పనులకు రూ69 లక్షలు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లు మేడపరెడ్డి వెంకట రమణ , తాడిపర్తి ప్రియాంక , పెనుగొండ ఏఎంసీ చైర్మన్‌ వెలగల వెంకటరమణ , ఎంపీపీ కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు), జడ్పిటిసి గౌరీ సుభాషిణి , వైసిపి మండల నాయకులు పాల్గొన్నారు.