Sep 12,2022 14:49

ప్రజాశక్తి - అనంతపురం కార్పొరేషన్‌ : సమన్వయంతో సచివాలయ సిబ్బంది, వాలంటిర్లు కలసి పనిచేసి ప్రజలకు మేలు చేయాలని నగర మేయర్‌ మహమ్మద్‌ వసీం సూచించారు. నగరంలోని 53, 54 సచివాలయాలను మేయర్‌ మహమ్మద్‌ వసీం సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి ప్రజల నుంచి ఏదైనా ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని, వాలంటీర్లు ఎవరైనా మీ మాట వినకుంటే నాకు అర్జీ రూపంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. సచివాలయ సిబ్బంది యూనిఫారం కొందరు ధరించకపోవటం పౖ మేయర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి ఉద్యోగి యూనిఫారం తప్పక ధరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.