Mar 08,2023 15:53

ప్రజాశక్తి-గోకవరం (తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరంలో అస్వస్థతకు గురైన చిన్నారి అక్షరు రామ్‌ చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్షరు రామ్‌ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న గోకవరానికి చెందిన పలువురు స్థానికులు ఆర్థిక సాయం అందజేశారు. బుధవారం గోకవరంలోని పేదల సంఘం అధ్యక్షులు వరసాల ప్రసాద్‌ ఆధ్వర్యంలో అక్షరు రామ్‌ వైద్యం నిమిత్తం 35 వేల రూపాయలు నగదును వైద్యులు పాలూరి బోసుబాబుకి స్థానిక రమా సత్యనారాయణ ఆలయం వద్ద అందజేశారు. అదేవిధంగా గోకవరం చెందిన 93- 94వ 10వ తరగతి బ్యాచ్‌కి చెందిన కరాసు శివరామకష్ణ ఫ్రెండ్‌ సర్కిల్‌ ఆధ్వర్యంలో 10వేల రూపాయలు నగదును వసూలు చేసి అక్షరు రామ్‌ బంధువులకు అందజేశారు.