- ధావన్.. టీమిండియా ఓపెనర్లు చోటు కష్టమే!
- ఆసియాకప్ జట్టు కెప్టెన్‌గా యశ్ ధుల్
ముంబయి: చైనాలోని హాంగ్జూ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో యువ క్రికెటర్లకు పెద్దపీట వేయనున్నట్లు మాజీ టీమిండియా బ్యాటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రీ చెప్పుకొచ్చాడు. సోమవారం ఓ యూట్యూబ్ ఛానల్ మాట్లాడుతూ.. ఆసియా క్రీడలు జరిగే సందర్భంలోనే భారత్‌లో ఐసిసి వన్డే ప్రపంచకప్ ఉన్న దృష్ట్యా యువ క్రికెటర్లతో కూడిన పురుషుల జట్టును పంపాలని బిసిసిఐ పంపడం ఖాయమని, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు మరోసారి మొండిచెయ్యి దక్కనుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆసియాకప్ పురుషుల జట్టులో కొత్త ముఖాలకు అవకాశం దక్కనుందని, సీనియర్ క్రికెటర్లు, ఓపెనర్లను కాదని బిసిసిఐ సెలెక్షన్ కమిటీ ఈసారి యువ క్రికెటర్లకు పెద్దపీట వేయడం ఖాయమన్నారు. అండర్-19 జట్టు కెప్టెన్ యుశ్ ధుల్ కెప్టెన్‌గా, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా ఎంపిక కానున్నారన్నాడు. ఆ తర్వాత తిలక్ వర్మ, సాయి సుదర్శన్ మిడిలార్డర్ బ్యాటర్స్‌గా ఎంపికవుతారని ఆయన చెప్పుకొచ్చాడు. ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్ల రేసులో ఉన్నారని, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి మిడిలార్డర్ బ్యాటర్స్‌గా కొనసాగుతారన్నాడు.










