ప్రజాశక్తి-నందిగామ : అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో యోగ గురువులు కిలారు ప్రసాద్ , సలావుద్ధీన్ లను యోగ సభ్యులు ఘనంగా సన్మానించి సత్కరించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా,ధృఢంగా వుండటానికి యోగ ఎంతో దోహదపడుతుందని యోగ గురువులు పేర్కొన్నారు. యోగ ద్వారా సకల రోగాలు దరి చేరవన్నారు. నందిగామ ప్రజలు ప్రతిరోజూ యోగ చేసి ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని కోరారు. ఈకార్యక్రమంలో చిరుమామిళ్ళ శ్రీనివాసరావు(బుజ్జి) ఎంవై దాసు , రవీంద్ర, రంగరావు , రామకృష్ణ, హరిబాబు, రఫీ , నానాజీ , నాగరాజు , మస్తాన్ , లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.










