Jun 21,2023 15:36

నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతి వనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా 3000 మంది వికలాంగులు యోగా చేశారు. ఈ మెగా ఈవెంట్‌లో అత్యధిక సంఖ్యలో వికలాంగులు యోగా చేసినందుకు ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తింపు కోసం నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.