Feb 14,2023 18:45

లోకేష్‌తో కలిసి పాదయాత్రలో నడుస్తున్న ఇంటూరి

ప్రజాశక్తి -కందుకూరు : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 19వ రోజు మంగళవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగింది. కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన 20 మందికి పైగా టిడిపి నాయకులు, కార్యకర్తలు వరుసగా మూడవ రోజు పాదయాత్రలో పాల్గొన్నారు. తొలతు పార్టీ అధికార ప్రతినిధి జీవి రెడ్డితో కలిసి ఇంటూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పాదయాత్రలో లోకేష్‌ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి తాడేపల్లి ప్యాలెస్‌లో వణుకు మొదలైందన్నారు.