ప్రజాశక్తి-చల్లపల్లి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పిల్లల చదువులకు ప్రాధాన్యత ఇవ్వాలో, వివిధ రకాల యాప్ ల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలో ప్రభుత్వం స్పష్టం చేయాలని పలువురు ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్ చేస్తు బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని విద్యాశాఖ కార్యాలయంలో అందజేశారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యా యులు నేతలు మాట్లాడుతూ . పాఠశాలల్లో వివిధ రకాల యాప్‌లు, రిపోర్ట్‌ల అప్లోడ్ చేయడం, డైరీలు రాయడం వంటి బోధనేతర పనులతో ప్రభుత్వ పాఠశాలల్లోని పేద పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన అందటం లేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.పాఠశాలలకు తమ వ్యక్తిగత చరవాణిలను తీసుకెళ్లే ప్రసక్తే లేదని, యాప్‌లు కొనసాగించాలంటే ప్రభుత్వమే ఎలక్ట్రానిక్ పరికరాలు సమకూర్చాలన్నారు. వివిధ రకాల యాప్ లు పేరుతో విలువైన బోధనా సమయాన్ని ప్రభుత్వం వధా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకరు లేదా ఇద్దరు ఉన్న పాఠశాలల్లో ఈపరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలిపారు. పిల్లల చదువులకు భంగం కలిగించే ప్రభుత్వ నిర్ణయాలను ఎట్టి పరిస్థితిలో అంగీకరించబోమని స్పష్టం చేశారు. యాప్ లు కొనసాగించాలంటే స్కూళ్లకు ఎలక్ట్రానిక్ పరికరాలు అందించి అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నేతలు దేవరపల్లి సురేష్ బాబు,నడకుదురు రవీంద్ర, కొండవీటి నాగరాజు,యార్లగడ్డ హితేంద్ర బాబు,యూ. కష్ణారావు, దుర్గాప్రసాద్, కె.జ్యోత్స్నా దేవి కె.అమరవాణి, కెఎస్ విఎన్ లక్ష్మీ,వాసుదేవరావు, ధనుంజరు, వేణు గోపాలరావు, ప్రమీల, పాల్గొన్నారు.










