Apr 24,2023 21:29
  • ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌

అస్టానా(కజకిస్తాన్‌):  ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌కై చైనాకు చెందిన డింగ్‌ లెరెన్‌, రష్యాకు చెందిన ఇయాన్‌ నెపోంనిచ్‌ల మధ్య జరుగుతున్న 11వ గేమ్‌ డ్రా అయ్యింది. దీంతో ఇరువురు ఆటగాళ్లకు అర పాయింట్‌ చొప్పున వచ్చింది. సోమవారం నెపోంనిచ్‌ ఇ4తో గేమ్‌ను ప్రారంభించగా.. డింగ్‌ లెరెన్‌ ఇ5తో గేమ్‌ను ప్రారంభించాడు. మొత్తం 14రౌండ్‌లకు జరిగే ఈ పోటీలో 7.5పాయింట్లు వచ్చిన గ్రాండ్‌మాస్టర్‌ విజేతగా నిలవనున్నాడు. చైనాకు చెందిన టాప్‌ సీడ్‌ ఆటగాడైన డింగ్‌ లెరెన్‌.. రష్యా యువ ప్లేయర్‌పై టైటిల్‌కై అమీతుమీ తేల్చుకోనున్నాడు. సోమవారంతో ముగిసిన 11 రౌండ్‌ అనంతరం డింగ్‌ లెరెన్‌ 5.0 పాయింట్లతో, నెడుంనిచ్‌ 6.0పాయింట్లతో ఉన్నారు. టైటిల్‌ను విజేతగా నిలవాలంటే లెరెన్‌కు 2.5పాయింట్లు, నెడుంనిచ్‌కు 1.5పాయింట్లు కావాల్సి ఉంది.