- అదరహో అనిపించిన ఆంధ్ర
- మధ్యప్రదేశ్ పై తేలిపోయిన తెలంగాణ
- కేరళ పై విజయం సాధించిన ఒడిస్సా
- గుజరాత్ పై హిమాచల్ విజయం
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : ఆంధ్రా హాకీ టీం బెంగాల్ టీంకు ముచ్చమటలు పట్టించింది. నువ్వా నేనా అన్నట్టుగా ప్రేక్షకులు ఉత్కంఠకు తలలైపుతూ సాగిన మ్యాచ్లో చివరికి డ్రాగా ముగిసింది. లీగుల మ్యాచ్ కావడంతో పెనాల్టీలు లేకపోవడంతో బెంగాల్ ఊపిరి తెలుసుకుందని చెప్పాలి. కాకినాడ జిల్లా ప్రాధికార సంస్థ మైదానంలో 13వ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు మూడోవ రోజు ఆహ్లాదకర వాతావరణమ్ లో సాగాయి. మొదటి మ్యాచ్ ఒడిస్సా కెరలకు జరిగిన మ్యాచ్లో ఒడిశా టీమ్ పోరాటపటిమను కనపరిచించి. ప్రత్యర్ది టీమ్ కు ఒక్క అవకాశమ్ కుడా ఇవ్వకుండా 13 గోల్స్ సాధించి మొదటి విజయాని నమోదు చేసుకోంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు ఒడిశా టీమ్ ప్రత్యర్థిని ఆటాడుకుంది. ప్లేయర్ అఫ్ థి మ్యాచ్ రింకు కుజు అందుకుంది.
- తెలంగాణ ఓటమి
ఆంధ్రా టీమ్ తో పాటుగా తెలంగాణ టీమ్ పై ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనపరిచారు. ప్రేక్షుకుల అభిరుచికి తగ్గట్టుగా కూడా మైదానంలో తమ అట తీరును ప్రదరించలేకపోయింది. మధ్యప్రదేశ్ చేతిలో ఒక్క గోల్ ను కూడా కొట్టకుండా 30 గోల్స్ సమర్పించుకుని ఘోర ఓటమిని మూతగట్టుకుంది. ఎటువంటి పోరాటపటిమను చూపించకుండానే తెలంగాణ టీమ్ మొదటి ఓటమిని మూతగట్టుకుంది. ప్లేయర్ అఫ్ థి మ్యాచ్ ప్రీతి దుర్జ్ కైసవం చేసుకుంది.
- ప్రత్యర్దికి అవకాశం ఇవ్వని హిమాచల్
హిమాచల్- గుజరాత్ టీమ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో 10-1 స్కోర్ నమోదు చేయగా, 9 గోల్స్ తెడాతో హిమాచల్ విజయం సాధించింది. ప్రత్యర్ది టీమ్ కు అవకాశాలు ఇవ్వకుండా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ చివరి వరుకు వచ్చిన అవకాశాన్ని గోల్స్ గా మలుస్తూ హిమాచల్ విజయం సాధించింది. ప్లేయర్ అఫ్ థి మ్యాచ్ అవార్డును రీతు కైసవం చేసుకుంది.
నువ్వా.. నేనా అన్నట్టుగా ఆంధ్ర- బెంగాల్ టీమ్ మధ్య మ్యాచ్ అసంతం సాగింది. గోల్ వేసేందుకు రెండు టీమ్ లు పోటా పోటీగా తలపడ్డాయి. ముడు సార్లు ఆంధ్ర టీమ్ గోల్స్ వేసేందుకు దూసుకు వెళ్లగా-బెంగాలా టీమ్ అడ్డుకుంది. చివరి వరకు పోరాడి మ్యాచ్ ను డ్రాగా ముగించింది. మ్యాచ్ లో పూర్తి పోరాట పటిమను ప్రదర్శించిన ఆంధ్ర టీమ్ కు చెందిన కేవీవీ దుర్గ కు ప్లేయర్ అఫ్ థి అవార్డు లభించింది.
- నేటి మ్యాచ్ వివరాలు
ఉదయం 7:00: కర్ణాటక- గోవా
ఉదయం 8:45 : జర్ఖండి - ఉత్తరాఖండ్
ఉదయం 10:30: హర్యానా - భీహర్
మధ్యాహ్నం 12:15: ఢిల్లీ - మణిపూర్
సాయంత్రం 3:45: మహారాష్ట్ర - అండమాన్-నిఖొభార్










