ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : ఇంటి స్థలం మంజూరు చేయాలని కోరుతూ మల్లం గ్రామానికి చెందిన నమ్మి సత్యవతి అనే మహిళ జిల్లా కలెక్టర్కు స్పందనలో సోమవారం ఫిర్యాదు చేసింది.గతంలో తన అధీనంలో నివాసం ఉన్న స్థలాన్ని గ్రామపంచాయతీ కార్యాలయ నిర్మాణానికి తీసుకున్నారని, తదుపరి వేరే చోట నివాసయోగ్యమైన స్థలాన్ని ఇచ్చేవరకు పాత పంచాయతీ కార్యాలయంలో నివాసం ఉండమని గ్రామ పెద్దలు చెప్పారు అన్నారు. ఇప్పుడు పాత పంచాయతీ కార్యాలయంలో కూడా తమను ఖాళీ చేయమని చెబుతున్నారని, తమకు ఎక్కడికి పోవాలో తెలియడం లేదని ఆవేదన చెందింది. కుటుంబమంతా రోడ్డున పడ్డామన్నారు.జిల్లా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.










