- లీగు దశలోనే ఇంటి బాట పట్టనున్న అండమాన్
- మరికొన్ని రాష్ట్రాలు
- ఆసక్తికరంగా సాగుతున్న ఇండియా సీనియర్ మహిళ హాకీ పోటీలు
- మూడవరోజు మ్యాచ్ లో ఆకట్టుకున్న
- మహారాష్ట్ర, మణిపూర్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల టీములు
ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్ : ఇండియా సీనియర్ మహిళా హకీ పోటీలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. కాకినాడ జిల్లా ప్రాధికార సంస్థ మైదానంలో 13వ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు కొనసాగుతున్నాయి. ఉదయం మొదటి మ్యాచ్ కర్ణాటక గోవా మధ్య జరగా, కర్ణాటక టీం గోవా టీంపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. ప్రత్యర్థ టీంకు అవకాశం ఇవ్వకుండా నిర్దేశిత సమయంలో10 గోల్స్ సాధించి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కర్ణాటక టీంకు చెందిన చందన ఎంపికయింది. అనంతరం ప్రారంభమైన హర్యానా భీహార్ టీముల మధ్య ఆసక్తికర మ్యాచ్ కొనసాగింది. ఢిల్లీ టీమ్ ను ముచ్చెమటోలు పట్టిస్తూ పూర్తి అధిపత్యాన్ని కదమరుస్తూ 9 గోల్స్ సాధించింది. ఢిల్లీ టీం తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా వృధా చేసుకోవడంతో ఒక్క గోలు కూడా సాధించకుండానే మ్యాచును ముగించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్యానా అమన్ దిలీప్ ఎంపికైంధి. జార్ఖండ్ - ఉత్తరాఖండ్ టీముల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా జరిగిందని చెప్పాలి. ఉత్తరాఖండ్ టీమ్ పై 13 గోల్స్ చేసి హర్యానా టీం విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గాఅమన్ దిలీప్ ఎంపికయింది. ఢిల్లీ - మణిపూర్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు పూర్తి రసవత్తకరంగా జరిగింది. ఢిల్లీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోవడంతో, మణిపూర్ కు 4 గోల్స్ సమర్పించుకుంది. చివరి వరకు పోరాడిన ఢిల్లీ ఎటువంటి గోల్స్ సాధించకుండానే మ్యాచును ముగించగా మణిపురి టీం విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సోనియా దేవి ఎంపికయింది. మహారాష్ట్ర అండమాన్ నికోబార్ టీముల మధ్య జరిగిన మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా జరిగిందని చెప్పాలి. మైదానంలో మహారాష్ట్రకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఏకంగా 402 గోల్స్ సమర్పించుకుంది. మ్యాచ్ చివరి వరకు అండమాన్ టీం తమ ప్రదర్శనతో ఆకట్టుకోలేదని చెప్పాలి. ప్రత్యతికి తలవంచుతూ ఆడిన రెండు మ్యాచ్ల్లో భారీ గోల్స్ సమర్పించుకుంది. దీంతో లీగు దశలోనే ఇంటి బాట పట్టేందుకు అండమాన్ టీమ్స్ సిద్ధమైంది. మరికొన్ని టీములు భవితవ్యం రేపు తేలనుంధి.
- నేటి మ్యాచ్ వివరాలు
ఉదయం 7:00: పంజాబ్ - హిమాచల్
ఉదయం 8:45 : ఉత్తర ప్రదేశ్ - ఆంధ్రప్రదేశ్
సాయంత్రం 3:45: అస్సాం - బీహార్










