ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: పట్టణ పరిధిలోని బలిజపల్లిలో గల పూసల వీధిలో చిన్న రెడ్డమ్మ (25) అనే మహిళ శనివారం సూపర్ వాస్మోల్ విష ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉన్నది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని 108 వాహనంలో పంచనామాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.










