Sep 27,2023 13:01

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం ఉండూరు గ్రామంకు చెందిన సత్యప్రసన్న ఆనే వివాహిత ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిందని భర్త  సురేష్ కుమార్ సామర్లకోట పోలీసులకు మంగళవారం రాత్రి పిర్యాదు చేసారు. పది సంవత్సరాల క్రితం సత్యప్రసన్నకు, సురేష్ కుమార్ ను ఇచ్చి వివాహం చేయగా వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కలరు. ఈ నెల 22న మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఫిర్యాది భార్య సాయి ప్రసన్న ఎవరికి చెప్పకుండా ఇంటిలో నుండి వెళ్లిపోయింది. చుట్టుపక్క గ్రామాలలో వారి బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె భర్త  ఇచ్చిన పిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.