Jul 10,2023 21:58
  • ప్రి క్వార్టర్స్‌లో ఓడిన సిట్సిపాస్‌
  • వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ఓ సంచలనం నమోదైంది. 5వ సీడ్‌, గ్రీక్‌కు చెందిన స్టెఫొనాస్‌ సిట్సిపాస్‌ ప్రి క్వార్టర్స్‌లో ఓటమిపాలవ్వగా.. జకోవిచ్‌, మెద్వదేవ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో జకోవిచ్‌ 7-6(8-6), 7-6(8-6), 5-7, 6-4తో 17వ సీడ్‌ హుర్క్‌రాజ్‌(పోలండ్‌)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇక మెద్వదెవ్‌కు జాక్‌పాట్‌ లభించింది. ప్రి క్వార్టర్స్‌లో మెద్వదెవ్‌ 6-4, 6-2తో రెండు సెట్లు గెలిచిన అనంతరం లెహెక్కా(చెక్‌ రిపబ్లిక్‌) గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో మెద్వదేవ్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకొచ్చాడు. ఇక సిట్సిపాస్‌ 6-3, 6-7(4-7), 6-3, 4-6, 4-6తో అన్‌సీడెడ్‌ క్రిస్టొఫర్‌(అమెరికా) చేతిలో పోరాడి ఓడాడు.

  • ఆండ్రీవా జోరుకు కీస్‌ బ్రేక్‌..

మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లోకి ఎలేనా రైబకినా, అమెరికాకు చెందిన కీస్‌ ప్రవేశించారు. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్లో రైబకినా 4ా1పాయింట్ల ఆధిక్యతలో ఉండగా.. ప్రత్యర్ధి హడ్డాడ్‌ మయియా గాయం కారణంగా మ్యాచ్‌నుంచి వైదొలిగింది. 13వ సీడ్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్‌కు చెందిన 27ఏళ్ల హడ్డాడ్‌.. తొలిసెట్‌ మధ్యలో గాయపడి ఫిజియోను పిలిచి చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. దీంతో మ్యాచ్‌కు 10నిమిషాల విరామం కూడా ప్రకటించారు. ఇక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో అరంగేట్రం చేసిన 16ఏళ్ల ఆండ్రీవా జోరుకు ప్రి క్వార్టర్స్‌లో బ్రేక్‌ పడింది. రష్యాకు చెందిన ఆండ్రివాస్‌కు ప్రి క్వార్టర్స్‌లో అమెరికాకు చెందిన మడిసన్‌ కీస్‌ చేతిలో 3ా6, 7ా6(7ా4), 6ా2తో ఓటమిపాలైంది. దీంతో కీస్‌ 2015తర్వాత తొలిసారి వింబుల్డన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకొచ్చింది.

  • మూడోరౌండ్‌కు బప్పన్న జోడీ

పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బప్పన్న జోడీ మూడోరౌండ్‌లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో 6వ సీడ్‌ రోహన్‌ బప్పన్నాఎబ్డెన్‌(ఆస్ట్రేలియా) 7ా5, 6ా3తో బ్రిటన్‌ జోడీని ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తొలి సెట్‌ను 7-6(5) తేడాతో చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఇవాన్‌, లతీషా ద్వయం వరుస సెట్లను 3-6, 4-6తో తమ ఖాతాలో వేసుకొని బోపన్న జోడీపై విజయం సాధించింది. అలాగే యుకీ, సాకేత్‌ జోడీ 4-6, 6-4, 4-6 తేడాతో ఓటమి చవిచూసింది.