- ఐసిసి వన్డే ప్రపంచకప్ అర్హత టోర్నీ
హరారే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించని వెస్టిండీస్ జట్టుకు చివరి మ్యాచ్‌లో ఊరట లభించింది. ఓమన్‌తో జరిగిన ఆఖరి సూపర్-6 మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఓమన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. షోయబ్ ఖాన్(50), సూరజ్ కుమార్(53) అర్ధసెంచరీలతో మెరిసారు. వెస్టిండీస్ బౌలర్లు షెఫర్డ్‌కు మూడు, మయర్స్‌కు రెండు, కెవిన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆ లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 39.4ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ కింగ్(100) సెంచరీకి తోడు, హోప్(63నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కింగ్‌కు లభించింది.
- స్కాట్లాండ్-నెదర్లాండ్స్‌కు అరుదైన అవకాశం..
ఐసిసి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు స్కాట్లాండ్-నెదర్లాండ్స్ జట్లకు అరుదైన అవకాశం దక్కింది. ఈ రెండుజట్ల మధ్య నేడు జరిగే ఆఖరి సూపర్-6 మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. స్కాట్లాండ్ జట్టు 31పరుగుల తేడాతో జింబాబ్వే ను ఓడించడంతో ఈ రెండు జట్లకు జాక్‌పాట్ దక్కింది. గ్రూప్ లీగ్ దశలో స్కాట్లాండ్ జట్టు వెస్టిండీస్‌ను, నెదర్లాండ్స్ జట్టు సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్‌ను ఓడించాయి. గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది.










