Jun 27,2023 13:05

ముంబయి : క్రికెట్‌ అభిమానులు ఎప్పుడా అంటూ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. భారత్‌లో అక్టోబర్‌-నవంబర్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీలో మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. బిసిసిఐ, ఐసిసి మంగళవారం ముంబయిలో ఐసిసి క్రికెట్‌ ప్రపంచ కప్‌ 2023 షెడ్యూల్‌ను ప్రకటించాయి. అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ జట్ల తొలి మ్యాచ్‌ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న జరగనుంది. అక్టోబర్‌ 5న టోర్నీ ప్రారంభమై నవంబర్‌ 19న ఫైనల్‌తో ముగుస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌, ముంబైలోని వాంఖడే క్రికెట్‌ గ్రౌండ్‌లు సెమీస్‌ మ్యాచ్‌ లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడి క్రికెట్‌ స్టేడియంలో జరుగనుంది. ప్రపంచంలో ఇదే అతి పెద్ద స్టేడియం. ఆతిథ్య భారత్‌ తన తొలి మ్యాచ్‌ని అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో అక్టోబర్‌ 8న ఆడనుంది. ఈ ప్రపంచ కప్‌ లో భారత్‌-పాక్‌ జట్ల మధ్య జరిగే సమరంపై భారత క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

111