Mar 24,2023 20:49

- మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సుకుమార్‌రెడ్డి

 రాయచోటి : ఆర్‌బికెల ద్వారా రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడూ అందించి జిల్లాలో వ్యవసాయ అభివద్ధికి కషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాన్ని జెసి తమీమ్‌ అన్సారీయాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సందర్భంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ వివిధ శాఖల ద్వారా త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయిలో సలహా మండలి సమావేశంలో సభ్యులు తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇటీవల అకాల వర్షాల కారణంగా వివిధ పంటల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారించి వారి పంటలను నమోదు ప్రక్రియ చేపట్టాలని అధికారులను సూచించారు. పంటల నమోదుకు సంబంధించి ఈ క్రాప్‌ బుకింగ్‌ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఇందులో క్షేత్రస్థాయిలో రైతులు ఏ పంట సాగు చేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, తదితర అన్ని రకాల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా చిరుధాన్యాలను సబ్సిడీ పైన రైతులకు అందించి వాటి సాగును ప్రోత్సహించాలని అధికారులను కోరారు. అనంతరం జెసి తమీమ్‌ అన్సారియా మాట్లాడుతూ అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఈ నెల 30లోపు గ్రామాల్లోని పరిశీలించి, నివేదికలు పంపాలని సూచించారు. ఎక్కడా పొరపాట్లకు తావు ఇవ్వద్దని, నిజాంగ నష్టపోయిన రైతులు గుర్తించి నివేదిక తయారు చేయాలని తెలిపారు. డిఆర్‌ డిఎ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 4 తేదీ నుంచి జిల్లా స్థాయిలో చిరుధాన్యాల పైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని, అదే విధంగా డివిజన్‌ స్థాయిలోనూ నిర్వహించాలని చెప్పారు. రబీ -2023 సంబంధించి పంట నమోదు వివరాలను సామాజిక తనిఖీ ద్వారా సవరించిన తుది జాబితాను ఈ నెల 30 లోపల రైతు భరోసా కేంద్రాల యందు ప్రదర్శించాలని సహాయ వ్యవసాయ సంచాలకులను ఆదేశించారు. గ్రామానికి ఒకటి చొప్పున మంజూరైన కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను (యంత్ర సేవా కేంద్రాలు) త్వరితగతిన పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ, సహాయ వ్యవసాయ సంచాలకులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి ఉమామహేశ్వరమ్మ, జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ సభ్యులు దిన్నేపాడు రవిరాజు, బోధషావలి, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.