Feb 12,2023 22:09

ఫొటో : జెండా ఆవిష్కరిస్తున్న వ్యకాసం నాయకులు

వ్య.కా.సం. జెండా ఆవిష్కరణ
ప్రజాశక్తి-జలదంకి : అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా మహాసభలో పశ్చిమ బెంగాల్‌ హౌరాలో జరుగుతున్న సందర్భంలో కావలి రూరల్‌, జలదంకి మండలాలలో వ్యవసాయ కార్మిక సంఘం జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జలదంకి మండలం, జమ్మలపాలెంలో మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు పులుసు కోటేశ్వరమ్మ అరుణ పతాకాన్ని ఎగరవేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు మాల్యాద్రి మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన ఈ సంఘం దేశం నలుమూలల వ్యాపించిందని భూ ఉద్యమాలు 'భూమి పోరాటాలు' ఉపాధి చట్టం ప్రతిష్టంగా అమలు చేయాలని 'సంక్షేమ కార్యక్రమాలు జరపాలని' వీటిని అమలు జరిపించుకునేందుకు అవసరమైన పోరాటాలలో ఈ మహాసభలో రూపకల్పన చేస్తారని ఆయన తెలియజేశారు.
అదే సందర్భంగా దళితులపై దాడులు హెచ్చుమీరాయని వాటిని అరికట్టేందుకు మనువాద పార్టీ అయినా బిజెపి ఏ చర్యలు తీసుకోకపోగా మరింతగా దళితులను అట్టడుగు ప్రజలను అణచివేస్తుందని డివైఎఫ్‌ఐ నాయకులు అడపాల సురేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మర్రి మధు 'కావలి శ్రీనివాసులు' శెట్టిపల్లి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే జలదంకిలో సురేష్‌ సెక్యూరిటీ భవనంపై మారుబోయిన కొండమ్మ సంఘ పతాకాన్ని ఎగరవేశారు. కార్యక్రమంలో బత్తల నరసింహ 'కుట్టు బోయిన శ్రీనివాసులు 'షేక్‌ ఖాజాబీ' కె.హరి తదితరులు పాల్గొన్నారు. కావలి తుమ్మలపెంట మలుపు రోడ్డు వద్ద కావలి మండల అధ్యక్షులు పెముల సీతారామయ్య జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టి.మాల్యాద్రి, కె.వి.పి.ఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు కె జాను, అశోక్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు. తదుపరి కావలి మండలం ఆర్‌సిపాలెంలో వ్యవసాయ కార్మిక సంఘం జెండాను పి.సీతారామయ్య ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు.