Aug 19,2022 22:48

 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున
ప్రజాశక్తి-అవనిగడ్డ

రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వసతి గృహాలు రెసిడెన్షియల్‌ పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. శుక్రవారం అవనిగడ్డకు విచ్చేసిన ఆయన సాంఘిక సంక్షేమ శాఖ బాలుర బాలికల వసతి గహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వసతి గహాలను నాడు-నేడు పథకం ద్వారా అత్యంత ఆధునికరించాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కషి చేస్తున్నారని, ఎస్సీ రెసిడెన్షియల్‌ పాఠశాలలను మరింత అభివద్ధి చేయాలని సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు పిల్లలు సక్రమంగా చదువుకోవాలంటే వసతి గహాల్లో మంచి వాతావరణం ఉండాలని అప్పుడే విద్యార్థులు ఆరోగ్యంగా పెరుగుతూ చదువుకుంటారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా హాస్టల్స్‌ గురించి ఎన్నడూ పట్టించుకోలేదని, దానితో ఎక్కడ వేసిన గొంగళి ఆ క్కడ లాగానే ఉండేది అన్నారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుండి త్రివర్ణ పతాకాన్ని ఎత్తుకొని ప్రజలు ఊరేగుతుంటే లోకేష్‌ మాత్రం గోరంట్ల మాధవ్‌ ను ఎత్తుకు తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. మార్పింగ్‌ వీడియో అని పోలీసులు చెబుతుంటే అమెరికా నుండి రిపోర్టులు తెప్పించామని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఫేక్‌ రిపోర్టులతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని అప్రతిష్టపాలు చేయాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు ప్రయత్నం చేస్తున్నారన్నారు వీరికి తోడు దుష్ట చతుష్యంగా ఉన్న ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబీఎన్‌ టీవీ ఫైవ్‌ లాంటి ఇంటి ఎలక్ట్రానిక్‌ మీడియా సైతం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వార్తలు వండి ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. నిజంగా ఎంక్వయిరీలో ఎంపీ పాత్ర ఉంటే చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పిన విషయాల్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ బార్సు హాస్టల్‌ రెండు అదేవిధంగా బాలికల వసతి గహాలను పరిశీలించి అక్కడ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను నేను ప్రకారం ఆహార అందిస్తున్నది లేనిది తెలుసు కున్నారు. విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి భవిష్యత్తులో మెనూ రేట్లు పెరగనున్నట్లు చెప్పారు. వసతి గహాల నిర్వహణ పట్ల మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌ బాబు, దివి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, గ్రామ సర్పంచ్‌ గో రుముచ్చు ఉమా, పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.