Jul 22,2022 22:33

ప్రజాశక్తి - యంత్రాంగం : గోదావరి వరదలకు జిల్లాలోని పలు మండలాల్లో ముంపు గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత వారం రోజులుగా ఉన్న వరద ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే వరద కారణంగా ఇళ్లు, పంటలకు నష్టం వాటిల్లింది. గ్రామాలు బురదమయంగామారాయి. దీంతో బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
 

                                                         మామిడికుదురు మండల పరిధిలో..

మామిడికుదురు మండల పరిధిలో పెదపట్నంలంక, అప్పనపల్లి, బి.దొడ్డవరం, గ్రామాలు పూర్తిగా పెదపట్నం లో రత్నాపురం,శివాలయం కాలనీ,కోనవారి వీధి పాశర్లపూడిలో శ్రీరామ్‌ పేట, పల్లవ పాలెం ప్రాంతాలు వారం రోజుల నుంచి వరద ఉధృతిలో పూర్తిగా మునిగిపోయాయి. ఇప్పుడిప్పుడే నీట నుంచి తేలడంతో ఇళ్లలో పేరుకుపోయిన బురద తొలగించే పనిలో నిమగమైనారు. పునరావాస శిబిరంలేక నీట మునిగి ఇంటిలోనేమ నివాసముంటున్నారు. పాశర్లపూడి-అప్పనపల్లి ప్రధాన ఆర్‌ అండ్‌ బి రహదారి పాటు రేవులో వరద నీరు ప్రవహిస్తుండటంతో శుక్రవారం కూడా రాకపోకలు స్థంబించిపోయాయి. వారం రోజులుగా వరద నీటిలో నానుతూ పూరి గుడిసెలు కూలిపోవడంతో ఆరుబయట గుడారాలు వేసుకుని అవస్థలు పడుతున్నారు.వరద ప్రభావం ఉదతి రహదారులు పూర్తిగా ద్వంసం కావడమే కాకుండా పక్కా గహాలు గోడలు కూలి పోయాయి.కూలిన ఇళ్ళకు సంబంధించి నష్టపరిహారం తక్షణమే అందించి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
 

                                                                     గ్రామాల్లో బురద

కాట్రేనికోన గోదావరి వరద ఉధృతి తగ్గడంతో వరద బాధితులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ గ్రామాలు బురదమయం అయ్యాయి. పంచాయతీ సిబ్బంది వ్యాధులు ప్రబలకుండగా గ్రామం అంతా బ్లీచింగ్‌ చల్లుతున్నారు. మండల పరిధిలోని నడవపల్లి శివారు పల్లిపాలెం, పల్లంకుర్రు రేవు, బలుసు తిప్ప గ్రామాలలో వరద నీరు దిగడంతో బురదమైమయ్యాయి.
 

                                                            లంక రైతులకు అపార నష్టం

రామచంద్రపురం వరదల వల్ల లంక రైతులకు అపార నష్టం సంభవించింది. లంకలో అరటి తోటలు. మునగ చెట్లు, బొప్పాయి, తమలపాకుల తోటలు, కూరగాయల పంటలు వారం రోజులుగా నీట మునిగి ఉండటం తో పూర్తిగా కుళ్ళి పాడై పోయాయి. కోటిపల్లి, కోట, వీరవల్లి పాలెం, ఐనవిల్లి లంక తదితర ప్రాంతాల లంక రైతులకు అధిక మొత్తం లో నష్టం వాటిల్లింది. ల ంక ప్రాంతాలలో నష్టం పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
 

                                                        కపిలేశ్వరపురం మండలంలో..

కపిలేశ్వరపురం వరద ఉధతి కారణంగా ముంపు గురైన కపిలేశ్వరపురం మండలంలోని లంక గ్రామాలైన కేదార్లంక, నారాయణ లంక, వీధి వారిలంక , అద్దంకివారిలంక, పల్లపులంక గ్రామాల్లో వరద ఉధతి తగ్గడంతో లంక గ్రామాలు బురదమయంగా మారాయి. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. జెడ్‌పిటిసి సభ్యుడు పుట్టపూడి వీర వెంకట సూర్యనారాయణ నారాయణలంక గ్రామంలో అంగర పిహెచ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు.