ప్రజాశక్తి-నెల్లూరు :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా కమిటీ తతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్యశాఖలో విధులు నిర్వహించి రిటైర్డు అయిన 38 మంది అధికారులను, ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. గురువారం నగరంలోని టౌన్ హాల్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డు ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కూడిన షీల్డ్ ను శ్రీ ఆరికొండ. హరిబాబు జిల్లా అధ్యక్షులు, కల్పం శ్రీనివాసులు జిల్లా కార్యదర్శి, డాక్టర్ కెఇసి విద్యాసాగర్ జిల్లా గౌరవాధ్యక్షులు గార్ల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఎన్ రమేష్ నాథ్ హాజరైయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పెద్దల సభకు రావడం, పెద్దలందరినీ అభినందించే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన సర్వీస్ మొత్తంలో చిరు ఉద్యోగి నుండి డాక్టర్లు అధికారుల వరకు ఎవర్ని ఇబ్బందులకు గురి చేయకుండా, చార్జెస్ ఫ్రేమ్ చేయకుండా మంచిగా సేవ చేసేటట్లు చూడడం జరిగిందన్నారు. ఉద్యోగులును మన కుటుంబ సభ్యులు లాగా చూసుకోవడ చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని ఉద్ధేశించి రాష్ట్ర అధ్యక్షులు పి సత్యనారాయణ, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పి మోహన్ బాబు, రాష్ట్ర కోశాధికారి డి.సువర్ణ పాల్, ఏపిజిఈఎఫ్, హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, డాక్టర్ ఇఫ్తికార్ అహ్మద్, డాక్టర్ రంగారావు, డాక్టర్ పేరారెడ్డి డాక్టర్ సాయి ప్రతాప్ సింగ్, డాక్టర్ కష్ణ మూర్తి, వి శేషగిరిరావు గౌరవ న్యాయ సలహాదారులు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆర్ ఇందిరా, డాక్టర్ ఎస్ డి మున్వర్ సుల్తానా, వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు,, ట్రెజరర్ నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణయ్య, తదితరులు ప్రసంగించారు.










