Feb 13,2023 19:09

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరు అంకమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణం పనులు ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణ కమిటీ సభ్యుల నిరంతర పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం అరటి పాముల మహేష్‌ కుమార్‌ భార్య నాగ మల్లేశ్వరి, వారి కుమారులు కుమార్తెలు సువర్ణ యంత్రానికి రూ.5116లు, విరాళాగా కమిటీ సభ్యులకు అందజేశారు. మంచిరాజు మురళీమోహన్‌, కొండూరి వసంతరావు, అర్చక స్వామి పాల్గొన్నారు.