Feb 14,2023 18:48

విరాళం అందజేత : ప్రజాశక్తి -కందుకూరు :కందుకూరులోని అంకమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణం భక్తులు విరాళాలు అందజేస్తు న్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి పాదాల చెంత ఉంచే సువర్ణ యంత్రానికి ముక్కాల విజయరామకష్ణ ధనుష్‌ పుట్టినరోజు సందర్భంగా ముక్కాల బాలాజీ సింగయ్య భార్య నీలిమ, కుమారులు విజయరామకష్ణ ధనుష్‌,సాయి జయంత్‌లు ఒక గ్రాము బంగారానికి రూ.5821లు విరాళంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమి రెడ్డి వెంకటరెడ్డికి అందజేశారు. నిర్మాణ కమిటీ సభ్యులు తల్లపనేని వెంకటేశ్వర్లు, కొడాలి కోటేశ్వరరావు పాల్గొన్నారు.