విజయదీపిక స్టడీ మెటీరియల్ పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన విజయదీపిక స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం ఎంఇఒ షేక్ మస్తాన్ వలీ పంపిణీ చేశారు. మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ, జిల్లా ఉన్నత పాఠశాలల 10వ తరగతి విద్యార్థులకు విజయ దీపిక స్టడీ మెటీరియల్‌ను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి చదివే ప్రతి విద్యార్థికీ ఈ విజయ దీపికలను అందించాలని, పబ్లిక్ పరీక్షలలో మంచి మార్కులతో నూటికి నూరుశాతం ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకొని ఈ స్టడీ మెటీరియల్‌లోని కంటెంట్‌ను ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా సులభరీతిలో బోధించాలని సూచించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, జిల్లా ఉన్నత పాఠశాల అపసముద్రం ప్రధానోపాధ్యాయులు జి.వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఉన్నత పాఠశాల కృష్ణంపల్లి ఉపాధ్యాయులు డి.రమేష్ పాల్గొన్నారు.










