మైలవరం : విద్యుత్ పోరాట అమరుల సంస్మరణ సభ ఆదివారం స్థానిక నూజివీడురోడ్డులోని జాతీయ గ్రంధాలయంలో ఘనంగా జరిగింది. అమరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి రావురి రమేష్‌బాబు మాట్లాడుతూ 2002వ సంవత్సరంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు విచాక్షణ రహితంగా కాల్పులు జరిపారన్నారు. ఆ కాల్పుల్లో విషు ్ణవర్థన్‌రెడ్డి, బాలస్వామి, రామకృష్ణలు మరణిం చారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఈకార్యక్ర మంలో మండల రైతు సంఘం కార్యదర్శి వజ్రాల వెంకటరెడ్డి, సీపీఎం మండల కమిటీ సభ్యులు సంది పాము ఇస్సాక్, షేక్ అల్లాభక్షు, ఎస్ మోహనరావు, పత్తిపాటి రాము, తదితరులు పాల్గొన్నారు.
తిరువూరు : విద్యుత్ అమరవీరుల దినోత్సవం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తిరువూరు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమా లేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు పంతంగి శ్రీనివాసరావు, సాంబార్లు వెం కటేశ్వర్లు ఎ.రవి, బి వెంకటేశ్వరరావు, జెట్టి శ్రీనివాసరావు, పాపారావు, శివరా మకష్ణ, విష్ణు, వెంకటరత్నం, ఎస్‌ఎ ఫ్‌ఐ మాజీ నాయకులు నాగేశ్వరావు పాల్గొన్నారు










