Aug 29,2022 22:54

అవనిగడ్డ : విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా రాణించాలని జిల్లా విద్యాశాఖ అధికారి తెహరా సుల్తానా సూచించారు. జాతీయ క్రీడ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చల్లపల్లి సబ్‌ జోన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా దినోత్సవంలో డీఈవో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇప్పటికే అవనిగడ్డ విద్యా హబ్బుగా కొనసాగుతోందని, దీంతో క్రీడ హబ్‌ గా కూడా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఎక్కడ ఏ క్రీడా కార్యక్రమం జరిగిన అవనిగడ్డకు సంబంధించిన వ్యాయామ ఉపాధ్యాయుల క్రీడాకారుల ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్‌ గుర్తింపు తెచ్చుకున్నట్లుగా క్రీడలలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్‌ బాబు డిఈఓతో కలిసి భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధ్యాన్చంద్‌ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించార. అనంతరం పులిగడ్డ ఏపీ ఆర్‌ ఎస్‌ విద్యార్థులు 200 అడుగుల భారీ జాతీయ పతాకం, ఎన్నారై వికాస్‌ 100 అడుగుల జాతీయ పతాకం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 30 అడుగుల జాతీయ పతాకంతో 2000 మంది విద్యార్థులు పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ ఎన్‌ శివశంకరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దివి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కడవకొల్లు నరసింహారావు, ఎంపీపీ తుంగల సుమతీదేవి, జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణ, డి.ఎస్‌.పి మహబూబ్బాషా సిఐ జి శ్రీనివాస్‌, సర్పంచ్‌ గో రుముచ్చు ఉమా, శ్రీరామ వెల్ఫేర్‌ సొసైటీ నిర్వాహకులు తోట శ్యామ్‌ కిషోర్‌ నాయుడు పాల్గొన్నారు