Jan 27,2021 22:30

జిల్లా ప్లీనరీలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ

- ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి నరసింహా
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు: 
విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ ఒక దిక్సూచిలా పని చేస్తుందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ సహాయ కార్యదర్శి నరసింహా తెలిపారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ స్థానిక భవిత కల్యాణ మండపంలో నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్‌, జిల్లా కార్యదర్శి ప్రకాష్‌, సహాయ కార్యదర్శి ఉదరు, రాయలసీమ యూనివర్సిటీ కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరసింహా, జిల్లా మాజీ నాయకులు రాఘవేంద్ర మాట్లాడుతూ... నూతన జాతీయ విద్యా విధానం, దాని వల్ల జరిగే నష్టాలు, విద్యారంగ సమస్యలు పరిష్కారాలు, పోరాటాలను వివరించారు. జిల్లా ప్లీనరీ భవిష్యత్‌ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఒక వేదిక కానుందని తెలిపారు. ప్లీనరీ సమావేశాలతో సమాజం పట్ల అవగాహన కలుగుతుందని వివరించారు.