జిల్లా వ్యాప్తంగా జెండావిష్కరణలు
ప్రజాశక్తి - కర్నూల్ కార్పొరేషన్: ఎస్‌ఎఫ్‌ఐ 50వ అవిర్భాÛవ దినోత్సవం సందర్భంగా కర్నూలు కె.కె భవన్ ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ జెండావిష్కరణ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్, ప్రకాష్ లు మాట్లాడుతూ 1970వ సంవత్సరం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో డిసెంబర్ 29,30 తేదీల్లో మొదటి సమావేశాలు నిర్వహించారన్నారు. చదువు-పోరాడు అనే నినాదంతో స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, అనే లక్ష్యాలతో ముందుకు సాగి నేడు దేశ వ్యాప్తంగా బలమైన విద్యార్థి సంఘంగా ముందుండి విద్యార్థులను ఐక్యం చేసి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందని తెలిపారు. నేడు కేంద్ర విశ్వవిద్యాలయాల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ ప్రాతినిధ్యంలో లెఫ్ట్ యూనియన్స్ ఆధ్వర్యంలో 12 కేంద్ర యూనివర్సిటీ ఎన్నికల్లో గెలుపొందిందన్నారు. నగర అధ్యక్షుడు మధు, నాయకులు సాయి, ఉదరు,విజరు, తిమ్మప్ప, సన్నీ విద్యార్థులు పాల్గొన్నారు. ఆలూరు : బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్, మండల అధ్యక్ష, కార్యదర్శులు రామాంజి, వినోద్‌లు మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలకు సొంతస్థలం, భవన నిర్మాణం ఎస్‌ఎఫ్‌ఐ పోరాట ఫలితమే అన్నారు. మాజీ నాయకులు కెపి.నారాయణస్వామి, మైనా, జిల్లా సహాయకార్యదర్శి గోవర్ధన్‌చ విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు : సోగనూరు రోడ్డు జడ్పిహెచ్‌ఎస్ హైస్కూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి తిమ్మప్ప జెండాను ఆవిష్కరించారు. జిల్లా సహాయ కార్యదర్శి ఉదరు, పట్టణ అధ్యక్షులు అజిత్ సహాయ కార్యదర్శి అనిల్, నందవరం మండల అధ్యక్షులు రంగప్ప, నాయకులు ఆర్యన్, ప్రవీణ్, కిషోర్ పాల్గొన్నారు. ఆదోని : బాలికల కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ జెండా ఎగురవేశారు. పట్టణ అధ్యక్షుడు సిద్దు, శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఉదరు, రామకృష్ణ, అమ్రేష్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యూనివర్సిటీ అభివద్ధి కోసం నిరంతరం పోరాటం
కర్నూలు క్రైం : రాయలసీమ యూనివర్సిటీ అభివద్ధి కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడతామని ఎస్‌ఎఫ్‌ఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహ, ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కార్యదర్శి రామకష్ణ అన్నారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ 50వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కారించుకొని యూనివర్సిటీలో ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఎగురవేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం గళం విప్పుతుందని, విలువలకు కట్టుబడి ఉందని అన్నారు. దేశాన్ని అభివద్ధి దిశగా నడిపే సత్తా ఎస్‌ఎఫ్‌ఐకే ఉందని అన్నారు. రాయలసీమ యూనివర్సిటీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇది చాలా దుర్మార్గం అని అన్నారు. యూనివర్సిటీకి రెగ్యులర్ ప్రొఫెసర్లను నియమించకుండా ప్రభుత్వం విద్యార్థులకు విద్యను దూరం చేస్తోందని చెప్పారు. యూనివర్సిటీ ని పరిశోధనా కేంద్రంగా తయారు చేయాలని, అందుకు అనుగుణంగా కోర్సులు ప్రవేశపెట్టి, విద్యను అభివద్ధి చేయాలని కోరారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ అభివద్ధి కోసం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు మునిస్వామి, యూనివర్సిటీ అధ్యక్షుడు రవి, మక్బుల్, సుభాన్, దేవేంద్ర, రామంజి, వీరాంజి, వెంకటేష్, మౌనేశ్, నాయుడు, మద్ది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆర్‌యులో మాట్లాడుతున్న టి.నరసింహా










