May 04,2023 22:56

ప్రజాశక్తి - తిరువూరు : విద్యార్థులకు విజ్ఞానంతో పాటు, వినో దాన్ని కూడా అందించే లక్ష్యంతో జన విజ్ఞానవేదిక (జెవివి) ఉచిత వేసవి శిక్ష ణా శిబిరాలను నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవా లని జెవివి జిల్లా గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ వి.రవీంద్ర విజ్ఞప్తి చేశారు. స్థానిక జ్యోతి నర్సింగ్‌ హౌంలో శిక్షణా శిబిరంకు సంబంధించిన కరపత్రాలను ఆయన జెవివి నాయకుల, సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. తిరువూరులోని సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ నున్న శిబిరంలో ఈనెల 5 నుండి స్పోకె న్‌ ఇంగ్లీష్‌, ఇంద్రజాల ప్రదర్శనలో ఉచి తంగా శిక్షణ ఇస్తామని జెవివి జిల్లా ప్రధానకార్యదర్శి ఎల్‌. గంగాధర్‌ తెలిపారు. జెవివి నాయకులు ఎం.రా ప్రదీప్‌, బి.వెంకటే శ్వరరావు, సి హెచ్‌.శ్రీనివాసరావు, సభ్యులు పాల్గొన్నారు.