ప్రజాశక్తి-గన్నవరం
రానున్న ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చెప్పారు. బుధవారం ఉంగుటూరు మండలం పెద్ద అవుటుపల్లి గ్రామంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో శాసనమండలి సభ్యుడు బచ్చుల అర్జునుడు ఇంటింటా తిరిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో మాట్లాడుతూ గ్రామాల అభివద్ధికి వినియోగించాల్సిన వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం దారి మళ్ళించి దోచుకుంటుందని ఆరోపించారు. గ్రామ సచివాలయానికి 20 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నానని వాటిని వినియోగిం చుకోవడానికి ఎమ్మెల్యేలకు అధికారాలు ఇస్తున్నామని చెప్పటం దారుణం అన్నారు. గ్రామాలలో నిధులు ఖర్చు పెట్టుకోవడానికి సర్పంచ్ కి అధికారాలు ఇవ్వకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గడచిన మూడు సంవత్స రాలలో గ్రామాలలో మీరు ఏమీ అభివద్ధి పనులు చేశారు అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, మండల పార్టీ అధ్యక్షుడు ఆరుమళ్ళ వెంకట కష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఆళ్ళ హనుక్,పాల్గొన్నారు.










