Sep 19,2023 19:23

వాల్‌ పోస్టర్‌ అవిష్కరిస్తున్న ఏజెంట్లు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు జీవిత బీమా కార్యాలయం ఎదుట ఎల్‌ఐసి ఏజెంట్లు గోడపత్రికలు,కరపత్రాలు ప్రదర్శించి మంగళవారం ఆవిష్కరించారు. వచ్చే నెల 9న హైదరాబాదు జోనల్‌ ఆఫీస్‌ ఎదుట ఆందోళన తలపెట్టిన సందర్భంగా కందుకూరు సీనియరు బ్రాంచ్‌ మేనేజర్‌ను కలిసి సిబ్బందికి, ఏజెంట్లకు కరపత్రాలు పంపిణీ చేసి సంఘీభావం పలికారు. వివిధ సమస్యలపై ధర్నాకు పిలుపు నిచ్చినట్లు నెల్లూరు డివిజన్‌ అధ్యక్ష డు బెజవాడ శివయ్య తెలిపారు. ఈ ఎ వరప్రసాద్‌, మధుసూదన, సుబ్బారావు, పిచ్చయ్య, బాలకోటేశ్వర రావు ,ప్రభాకర్‌,రాజేశ్వరాచారి ,చెన్నయ్య శ్రీధర్‌, మాల్యాద్రి ,శింగయ్య పాల్గొన్నారు