కదిరి అర్బన్ : వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి, బోయసఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు కృష్ణమూర్తి డిమాండ్ చేవారు. ఈ మేరకు ఆయన గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో ఆందోళనను దీక్షలు చేస్తుంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించి త్వరలోనే ఎస్టీ జాబితాలో పునరుద్దించడానికి కమిషన్ వేసి వాటి నుంచి వచ్చిన జాబితాను మంత్రివర్గంలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని మాట ఇచ్చారన్నారు. అయితే వారిచ్చిన మాటకు అతీగతీ లేదన్నారు. ఇప్పటికైనా త్వరలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో బిల్లును ఆమోదించకపోతే వచ్చే ఎన్నికల్లో వాల్మీకి బోయలు తగిన గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వాల్మీకి బోయ సంఘం నాయకులు, క్రాంతి కుమార్ నాయుడు బోయ, సురేష్, మోహన, నాని, కేశవ, శివప్రసాద్, అనిల్, అర్జున్, యుగంధర్, తదితరులు పాల్గొన్నారు.










