ఇద్దరి మృతి,
18 మందికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలో తుపాకీ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. తాజాగా ఫ్లోరిడాలో ఒక వీధిలో జరిగిన కాల్పులు ఘటనలో ఇద్దరు మరణించారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లోరిడాలోని ఈస్ట్ 7వ అవెన్యూలోని 1600 బ్లాక్లో ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లు టంపా పోలీస్ చీఫ్ లీ బెర్కావ్ మీడియాకు తెలిపారు. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవతో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని చెప్పారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కాగా, మృతుల్లో 14 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్లు సమాచారం.