బెల్‌గ్రేడ్ : సెర్బియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. రాజధాని బెల్‌గ్రేడ్‌లోని ఎలిమెంటరీ పాఠశాలలో బుధవారం ఉదయం 14 ఏళ్ల విద్యార్థి కాల్పులు జరిపాడు. టీచర్‌తో పాటు తోటి విద్యార్థులపై కాల్పులు జరిపినట్లు సెర్బియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డ్ సహా ఎనిమిది మంది విద్యార్థులు మరణించగా, టీచర్‌తో పాటు మరో ఆరుగురు విద్యార్థులు గాయాలపాలైనట్లు తెలిపింది. మొదట టీచర్‌ని షూట్ చేశారని, ఆపై వరుసగా కాల్పులు జరపడం ప్రారంభించినట్లు సెంట్రల్ వ్రాకార్ జిల్లా మేయర్ తెలిపారు. విద్యార్థిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.