Mar 19,2023 21:28

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కషి చేస్తా ఎమ్మెల్సీ మిట్ట రామచంద్రారెడ్డి

రాజంపేట అర్బన్‌ : ఉపాధ్యాయుల సమస్యల సాధనకు తన వంతు కషి చేస్తానని ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో విజయం సాధించిన మిట్ట రామచంద్రారెడ్డి తెలియజేశారు. ఆదివారం పట్టణంలోని కాకతీయ పాఠశాలలో ఆయనకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసంతోగెలిపించిన ఉపాధ్యాయులకు, జయానికి కషిచేసిన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జడ్‌పి చైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యావంతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారం చేసినా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయంతోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పారని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి తమ వంతు సహాయ సహకారాలు అందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కషి చేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పోలా శ్రీనివాసులురెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ చొప్పా ఎల్లారెడ్డి, అపుస్మా అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, వైష్ణవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌, మున్సిపల్‌ కౌన్సిలర్‌ పోలారమణారెడ్డి, జడ్‌పిటిసి దాసరి పెంచలయ్య, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ గొబ్బిళ్ళ త్రినాథ్‌ యాదవ్‌, కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జాహిద్‌ అలీ, భాస్కర్‌ యాదవ్‌, కౌన్సిలర్లు పెనిగలపాటి పెంచలయ్య నాయుడు, బిల్లా నరేష్‌ పాల్గొన్నారు.