Aug 24,2022 22:44

ప్రజాశక్తి కలక్టరేట్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉద్యోగులు, కార్మికులు ఐక్యం కావలసిన సమయం ఆసన్నమైందని సిఐటి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీసుకువచ్చే లేబర్‌ కోడ్‌ లను రద్దు చేయాలని కోడ్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రూల్స్‌ ను ఉపసంహరిం చుకోవాలని కోరుతూ ఉద్యోగ కార్మిక ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో ఉద్యోగ కార్మిక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఉమహేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో ఉద్యోగులు, కార్మికులు రక్షణకు భద్రత లేకుండా పోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం కార్మికులకు మంచిది కాదన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల రాబోయే రోజుల్లో దేశ ప్రజల పరిస్థితి ప్రమాదంలో పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కార్మికులు ఉద్యోగుల పరిస్థితి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టవేయపడుతుందని అవేదన వ్యక్తం చేశారు .ఇంత వరకూ ఉనికిలో వున్న 44 కార్మిక చట్టాలలో 29ని రద్దు చేసి 4 లేబర్‌ కోడ్స్‌ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విషయం తెల్సిందేనన్నారు. వాటిని తొలి నుంచి కార్మిక సంస్థలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నా యన్నారు.ఈ బిల్లుల్ని చట్టాలుగా చేయొద్దంటూ కార్మిక సంస్థలు పలు మార్లు దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెల్ని కూడా నిర్వహించా యన్నారు. అయినా ఆ బిల్లుల్ని పార్లమెంటు ఉభయ సభలలో ఏ.పి రాష్ట్ర ప్రభుత్వం బలపరచిందన్నారు. కార్మికవర్గ నిరసనను ఖాతరు చేయ కుండా బలపరచిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని గతంలో కూడా ఖండిం చామన్నారు. కాబట్టి లేబర్‌ కోడ్స్‌ అమ లుకు రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్యం చేసే లక్ష్యంతో తిరుపతిలో ఈ నెల 25,26లలో కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశ లక్ష్యానికి ఏ.పి రాష్ట్ర ప్రభుత్వం దూరంగా డిమాండ్‌ చేశారు. సిఐటియు జిల్లా కోశాధికారి బూర సుబ్రమణ్యం అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ఐసీయూ డివిజన్‌ కార్యదర్శి జి.కిషోర్‌ కుమార్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు లింగం ఫిలిప్‌, ఏపీ ఎన్జీఓ స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అకురి. శ్రీనివాసరావు, అంగన్‌ వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు రమదేవి, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకురాలు ఎం.కాశామ్మ ప్రసంగించిన ఈ సదస్సులో పెద్ద ఎత్తున ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.