ప్రజాశక్తి-హిందూపురం : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెల మూర్చవ్యాధి గ్రస్తులకు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం ఆదివారం పట్టణంలోని ఆర్‌పిజిటి రోడ్డులోని ఆల్ హి లాల్ పాఠశాల ఆవరణంలో నిర్వంచారు. ఈ సందర్బంగా వైద్యులు డాక్టర్. ఇటి రామ్మూర్తి 137 మంది మూర్చ రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించి, వారందరికి ఒక నెలకు సరిపడు మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూర్చవ్యాధి గ్రస్తులు నీరు, నిప్పు వద్ద, ఎత్తైన ప్రదేశాల్లో, యంత్రాల వద్ద సంచరించరాదన్నారు. క్రమం తప్పకుండా మందులు వాడితే వ్యాధిని నియంత్రించ వచ్చునన్నారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు జెవివి నాయకులు జిఆర్ శ్రీనివాసులు, రామకృష్ణ, విశ్వనాథ చారి, ఉగ్రప్ప, నాగరాజ గుప్త, మంజునాథాచారి, చంద్రశేఖర్‌రెడ్డి, అంజనరెడ్డి, అన్వర్, నరసింహులు , అబ్దుల్ హక్, పెన్నయ్య, మురళిమోహన్, ప్రభాకర్, ఉమాపతి, సుబ్రమణ్యం తదితరులు సేవలు అందించారు.










