Sep 28,2023 12:41

ప్రజాశక్తి-అరకులోయ : విద్యుత్ ఘాతానికి గురై ఓ గిరిజన విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ  మండలంలోని కొత్త బల్లుగూడ  పంచాయతీ గద్య గూడ గ్రామానికి చెందిన వంతల అప్పలరాజు(12) గిరిజన విద్యార్థి అరకులోయ మండలంలోని లోతేరు గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే స్కూల్ నుంచి గురువారం ఉదయం ఇంటికి వస్తూ, గ్రామ సమీపంలోని కొత్తగా వేసిన రైల్వే ట్రాక్ లోని కరెంట్ ఫోల్ అనుకోకుండా ఎక్కినట్లు సమాచారం. విద్యుత్ సరఫరా ఉండడంతో విద్యుత్ షాక్ కు గురై కింద పడిపోయాడు. విషయం తెలుసుకున్న తోటి పిల్లలు గ్రామానికి పరిగెత్తుకొని వచ్చి కుటుంబీకులకు బంధువులకు గ్రామస్తులకు చెప్పడంతో కుటుంబీకులు బంధువులు బోరున విలపిస్తూ, హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అప్పలరాజును హుటాహుటిన గద్యగుడ గ్రామ వాలంటీర్ స్వాభి రాజబాబు ఆటోలో అరకులోయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ ఘాతానికి గురి అయిన విద్యార్థి అప్పలరాజు శరీరం ముందు భాగం అంతా కాలిపోయింది. దీంతోపాటు విద్యుత్ స్తంభంపై నుంచి పడిపోవడంతో ఎడమ కాళ్లు కూడా విరిగిపోయింది. ఈ సంఘటనపై  పోలీసులకు, విద్యార్థి చదువుతున్న లోతేరు పాఠశాల నిర్వాహకులకు  సమాచారం అందవలసి ఉంది.