- రూ.1,289కోట్ల అత్యధిక బిడ్‌తో అహ్మదాబాద్ జట్టు కొనుగోలు
- మహిళల ఐపిఎల్ ఐదు ఫ్రాంచైజీల ద్వారా బిసిసిఐకి రూ.4670కోట్ల రాబడి
ముంబయి: 'మహిళల ప్రీమియర్ లీగ్'(డబ్ల్యుపిఎల్) ద్వారా బిసిసిఐకి కాసుల వర్షం కురిసింది. ఈ లీగ్‌లో ఐదు జట్ల కోసం బుధవారం నిర్వహించిన వేలంలో బిసిసిఐకి సుమారు రూ.4,670కోట్లు రానుంది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. అంటే 2008లో ప్రారంభమైన పురుషుల ఐపిఎల్ కంటే ఇది అధికం. పురుషుల ఐపిఎల్ బిడ్డింగ్ ద్వారా పొందిన దాని కంటే ఈ మొత్తం ఎక్కువ అని జై షా పేర్కొన్నారు. రూ.1,289కోట్ల అత్యధిక బిడ్‌తో ఆదానీ గ్రూప్ అహ్మదాబాద్ జట్టును కైవసం చేసుకుంది. ఆ తర్వాత రిలయన్స్ గ్రూప్స్ ముంబయిని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును బిడ్‌లో దక్కించుకున్నట్లు ఆర్సీబీ ఛైర్మన్ ప్రత్మేశ్ మిశ్రా ఓ ప్రకటనలో తెలిపారు.
ఫ్రాంచైజీల వివరాలు..
1. అహ్మదాబాద్ : అదానీ స్పోర్ట్స్‌లైన్స్ రూ.1,289కోట్లు
2. ముంబయి : ఇండియావిన్ స్పోర్ట్స్ ప్రై.లి. రూ.913కోట్లు
3. బెంగళూరు : రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ.901కోట్లు
4. ఢిల్లీ : జెఎస్‌డబ్ల్యు జిఎంఆర్ రూ.810కోట్లు
5. లక్నో : కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757కోట్లు
𝐁𝐂𝐂𝐈 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐬𝐮𝐜𝐜𝐞𝐬𝐬𝐟𝐮𝐥 𝐛𝐢𝐝𝐝𝐞𝐫𝐬 𝐟𝐨𝐫 𝐖𝐨𝐦𝐞𝐧’𝐬 𝐏𝐫𝐞𝐦𝐢𝐞𝐫 𝐋𝐞𝐚𝐠𝐮𝐞.
— BCCI (@BCCI) January 25, 2023
The combined bid valuation is INR 4669.99 Cr
A look at the Five franchises with ownership rights for #WPL pic.twitter.com/ryF7W1BvHH










