Sep 28,2023 09:28

ప్రజాశక్తి-లేపాక్షి : ఉత్తమ జాతీయ పర్యాటక గ్రామంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రసిద్ధ శిల్పకళాక్షేత్రం లేపాక్షి ఎంపిక అయింది. ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పర్యాటక శాఖ నుంచి లేపాక్షి సర్పంచ్‌ ఆదినారాయణ బుధవారం అవార్డు అందుకున్నారు. లేపాక్షికి జాతీయ స్థాయి గుర్తింపు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లేపాక్షిని మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల కోసం స్థానికంగా అన్ని సదుపాయలు కల్పిస్తామని సర్పంచ్‌ తెలిపారు. అవార్డు రావడంలో కృషి చేసిన రాష్ట్ర పర్యాటక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.