ప్రజాశక్తి-ఘంటసాల: కృష్ణా జిల్లా ఘంటసాల జడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న కొల్లూరి సురేష్ (43) గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మృతి చెందాడు. సేకరించిన వివరాల మేరకు చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన సురేష్ ఇటీవల బదిలీల్లో భాగంగా నాగాయలంక మండలం గణపేశ్వరం నుంచి ఘంటసాల జడ్పీ హైస్కూల్లో లెక్కలు మాస్టారుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం విధులకు హాజరైన సురేష్ గుండెపోటు రావడంతో సహోపద్యాయులు ఘంటసాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం 108 ద్వారా చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. సురేష్ మాష్టారు భార్య వక్కలగడ్డ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నారు. వారికి ఇరువురు కుమార్తెలు ఉన్నారు. జడ్పీ హైస్కూల్లో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో సురేష్ మాష్టారు హటన్మరణంతో ఉపాద్యాయుల్లో విషాధచాయలు అలుముకున్నాయి.










