Dec 12,2022 23:15

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌, టెక్‌ దిగ్గజం ఆపిల్‌ భారత్‌లోని టాటా గ్రూపునతో కీలక భాగస్వామ్యం కుదర్చుకుందని సమాచారం. ఈ ఒప్పందంలో భాగంగా దేశంలో 100 ప్రత్యేక ఆపిల్‌ స్టోర్లను తెరువనుందని ఇటి ఓ రిపోర్టులో పేర్కొంది. ఈ స్టోర్లలో కేవలం ఆపిల్‌ ఉత్పత్తులను మాత్రమే విక్రయించనున్నారు. ఇందుకోసం టాటా గ్రూపులోని ఇన్ఫినిటీ రిటైల్‌తో ఆపిల్‌ ఒప్పందం కుదుర్చుకుంటుందని సమాచారం. ఇన్ఫినిటీ ఇప్పటికే క్రోమా పేరుతో ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల షోరూంలను నిర్వహిస్తోంది.