Feb 11,2023 21:14

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు

        అమరాపురం : టిప్పర్‌, ద్విచక్రవాహనం ఢకొీన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి యంజేరు చెరువు మలుపు వద్ద శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... అమరాపురం మండలం హనుమంతనపల్లి గ్రామానికి చెందిన ఈరన్న కుమారుడు అనిల్‌ కుమార్‌(25), కర్ణాటక రాష్ట్రం హులికుంట గ్రామానికి చెందిన శ్రీధర్‌(24)లు హులికుంట నుంచి ద్విచక్రవామనంలో హనుమంతనపల్లికి బయలుదేరారు. ద్విచక్ర వాహనం హేమావతి యంజేరు చెరువు మలుపు వద్దకు రాగానే పావగడ నుంచి కర్నాటక రాష్ట్రం దొడ్డబానగెరెకు వెళ్తున్న టిప్పర్‌ ఢకొీంది. టిప్పర్‌ చక్రాలు యువకుల మీద వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను స్థానికులతో అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.