Mar 18,2023 21:28

రాంగోపాల్ రెడ్డి

ష పట్టభద్ర ఎమ్మెల్సీగా రామ్‌గోపాల్‌రెడ్డి ఎన్నిక
ష 'వెన్నపూస'తో హోరాహోరీ పోరు
ష 7,543 ఓట్ల మెజార్టీతో విజయం
ష పిడిఎఫ్‌ ఓట్లతోనే గెలుపుబాట
ష టిడిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలుప్రజాశక్తి - కడప ప్రతినిధి
పశ్చిమ రాయలసీమ పట్టభద్ర ఎమ్మె ల్సీగా టిడిపి మద్దతుదారు భూమిరెడ్డి రామ్‌ గోపాల్‌రెడ్డి గెలుపొందారు. మూడ్రోజులుగా అనం తపురం జెఎన్‌టియులో చేపట్టిన కౌంటింగ్‌లో తన సమీప ప్రత్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నుంచి ఎదురైన ఉత్కంఠ భరిత పోరులో 7,543 ఓట్ల మె జార్టీతో విజయం సాధించారు. అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 49 మంది అభ్యర్థులు నిలిచిన సంగతి తెలిసిందే. వీరిలో భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి, వెన్నపూస రవీం ద్రారెడ్డి మధ్య హోరాహోరీగా చివరి వరకు పోరు నడిచింది. వీరిలో ఎవరికీ 50 శాతం ఓట్లు లభించని నేపథ్యంలో ద్వితీయ ప్రాధాన్య ఓటును లెక్కించాల్సి వచ్చింది. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,45,513 ఓట్లు పోలు కాగా, 19,108 చెల్లని ఓట్లుగా తేలినట్లు సమాచారం. పోలైన 2,26,405 ఓట్లలో అధికార వైసిపి మద్దతుదారు వెన్నపూస రవీంద్రారెడ్డికి 1,02, 238 ఓట్లు రాగా, టిడిపి మద్దతుదారు రామ్‌ గోపాల్‌రెడ్డికి 1,09,781 ఓట్లు రావడం గమనార్హం. 7,543 ఓట్ల మెజార్టీతో టిడిపి మద్దతుదారు రామ్‌ గోపాల్‌రెడ్డి గెలుపొందారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం, కౌంటింగ్‌ దశల వరకు ప్రత్యర్థుల నుంచి తీవ్ర ప్రతి ఘటన ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, పరిశీలన, ఉపసంహరణ దశల అనంతరం హోరాహోరీగా తలపడాల్సి వచ్చింది. రామ్‌గోపాల్‌రెడ్డి, వైసిపి మద్దతుదారు వెన్న పూస రవీంద్రారెడ్డి, పిడిఎఫ్‌ మద్దతుదారు పోతుల నాగరాజు నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొవాల్సి వచ్చింది. కౌంటింగ్‌ దశలో ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులోనూ పిడిఎఫ్‌ ఓటర్ల మద్దతుతోనే టిడిపి మద్ద తుదారు గెలిచినట్లు తెలుస్తోంది. ద్వితీయ ప్రాధా న్యత ఓట్ల లెక్కింపులో మిగిలిన అభ్యర్థు ఓట్ల లెక్కింపు వరకు ఆధిక్యం చేతుల మారుతూ వచ్చింది. పిడిఎఫ్‌ ఓట్లు లెక్కి ంపు దగ్గర నుంచి రామ్‌గోపాల్‌రెడ్డిలో విజయం పట్ల ధీమా ఏర్పడింది. పిడిఎఫ్‌ ఓట్ల లెక్కిం పునకు ముందు దశ వరకు ఆధిక్యం చేతులు మారు తూ రావడంతో ఊపిరి బిగబట్టుకుని నిరీక్షించాల్సి వచ్చింది. పిడిఎఫ్‌ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్లు టిడిపి అధ్యక్షులు ప్రకటించడం ప్రతిపక్ష టిడిపి తరపున నిలిచిన అభ్యర్థులకు ఊహించిన వరంలా మారిందని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇదేతరహా పరిస్థితి తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుల్లో పిడిఎఫ్‌ ఓట్లు ప్రతిఫలించడం చర్చనీ యాంశంగా మారింది. ఏదేమైనా టిడిపి మద్ద తుదారు భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి పిడిఎఫ్‌ ఓట్ల దన్నుతో గెలుపొందిన నేపథ్యంలో అధికార వైసిపి పొత్తులు, ఎత్తుల వ్యూ హాల పట్ల అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.