Sep 17,2023 19:22

రమణయ్యకు టిడిపి కండువా కప్పి ఆహ్వనిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర్గంలోని వైసిపికి చెందిన ముఖ్య నాయకుడు పువ్వాడి రమణయ్య నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పార్లమెంటు అధ్యక్షులు నూకసాని బాలాజీ సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. వైసిపి నాయకులు పువ్వాడి రమణయ్య గత కోదిరోజులుగా ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసిపిని వీడి రమణయ్య టిడిపి తీర్ధం పుచ్చు కున్నారు. పార్టీ కండువా కప్పి రమణయ్య ను టిడిపి శ్రేణులు ఆత్మీయంగా ఆహ్వానం పలికారు.