Sep 14,2023 20:05

మద్దతు తెలుపుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య

ప్రజాశక్తి-కందుకూరు : మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులకు నిరసనగా చంద్రబాబు నాయుడుని జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్‌తో టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య సిపిఐ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపి గురువారం రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్‌ బాబు మాట్లాడారు. సిపిఐ నాయకులు వై ఆనందమోహన్‌, ఎస్‌ కె హుస్సేన్‌ ,నత్త మాధవరావు, బాల బ్రహ్మ, ఉప్పుటూరు మాధవరావు పాల్గొన్నారు.