Sep 14,2023 19:57

మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి ఆధ్వర్యంలో కందుకూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలతో వైసిపి నేతల్లో వణుకు మొదలైందని నియోజవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. స్థానిక శాసనసభ్యుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చిమరీ తమ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మార్పించారని విమర్శించారు. నారా చంద్రబాబునాయుడుని అక్రమంగా అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ, కందుకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం దగ్గర రెండో రోజు రిలేనిరాహార దీక్షలు కొనసాగాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ దివి శివరాంతో సహా పలువురు నేతలు దీక్షలో కూర్చున్నారు. పార్టీ సీనియర్‌ నాయకులు మాల్యాద్రి ఆరి చేత దీక్షలను ప్రారంభింపజేశారు. వైసిపి నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని నాగేశ్వరరావు హెచ్చరించారు. దివి శివరాం మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిప్పు అని, ఆయనకు చెదలు పట్టించాలనుకోవడం సాధ్యమయ్యే పని కాదన్నారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రూరల్‌ మండల అధ్యక్షులు నార్నే రోశయ్య, గుడ్లూరు మండల అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పార్టీ సాంస్కతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెళ్ల వెంకట రమణయ్య, నెల్లూరు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే, నెల్లూరు నెల్లూరు పార్లమెంట్‌ మహిళా కార్యదర్శి బత్తిన ఆదెమ్మ, నియోజకవర్గం ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడు పొడపాటి మహేష్‌, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి గొంది నర్సింగరావు దీక్షా శిబిరంలో మాట్లాడారు. దీక్షలకు సిపిఐ నేతలు సంఘీభావం తెలిపారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్‌ బాబు ఆధ్వర్యంలో రైతు సంఘం కన్వీనర్‌ బలిజేపల్లి వెంకటేశ్వర్లు, ఆనందమోహన్‌, షేక్‌ హుస్సేన్‌, నత్తా రామారావు, బొల్లోజుల బాలబ్రహ్మచారి, ఉప్పుటూరి మాధవరావు తదితరులు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్‌ ఇంటూరి నాగేశ్వరావు గారిని కలిసి మద్దతు తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు దీక్షలు ముగియగా, రాష్ట్ర బీసీ సెల్‌ కార్య నిర్వాహక కార్యదర్శి చిలకపాటి మధు, ఇంటూరి నాగేశ్వరరావు గారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.